Mobile Popup Ad
Mobile Popup Ad

క‌డ‌ప‌లో విషాదం.. న‌దిలో ముగ్గురు యువ‌కులు గ‌ల్లంతు!

క‌లం, వెబ్ డెస్క్‌: క‌డ‌ప (Kadapa) జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముగ్గురు యువ‌కులు స‌ర‌దాగా న‌దిలో ఈత‌కు వెళ్లి గ‌ల్లంత‌య్యారు. వల్లూరు మండలం పుష్పగిరి పెన్నా నది (Pushpagiri Penna River)లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు న‌దిలో గాలించ‌గా ఒక‌రి మృతదేహం ల‌భ్య‌మైంది. కడప టౌన్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన హర్షవర్ధన్ (22), కడప విశ్వనాథ‌పురానికి చెందిన హరిబాబు (25), కడప ఐటీ సర్కిల్‌కు చెందిన కృష్ణ చైతన్య (20)లు స‌ర‌దాగా ఈత‌కు వెళ్లారు. లోతు ఎక్కువ‌గా ఉండ‌టంతో ముగ్గురు నీటిలో గ‌ల్లంత‌య్యారు. స్థానిక ఎస్సై సాయంతో హరిబాబు మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారి కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ముమ్మ‌రంగా గాలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>