క‌రాచీలో అమెరికా కాన్సులేట్ వద్ద హై టెన్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్‌ (Iran)పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల‌తో మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఇరాన్ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీ మ‌ర‌ణ వార్త ప్ర‌పంచంలోనే సంచ‌ల‌నంగా మారింది. ప‌లు దేశాల్లో ఖ‌మేనీ మృతితో ప్ర‌జ‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. మ‌రికొన్ని చోట్ల‌ ఇరాన్‌ మ‌ద్ద‌తుదారులు ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌లోని క‌రాచీలో తీవ్ర ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ఇరాన్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున క‌రాచీలోని అమెరికా కాన్సులేట్‌ (Karachi US Consulate)కు చేరుకొని ఆందోళ‌న చేప‌ట్టారు. క‌ర్ర‌లు, రాళ్ల‌తో కాన్సులేట్ భ‌వ‌నంపై దాడికి దిగారు. భ‌వ‌నానికి నిప్పు పెట్టి హంగామా చేశారు. అక్క‌డ ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందిపై ప‌లువురు ఆందోళ‌న‌కారులు కాల్పులు జ‌రిపారు. దీంతో ప‌లువురు మృతి చెందిన‌ట్లు స‌మాచారం.

Read Also: మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉద్రిక్త‌త‌.. సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు వాయిదా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>