కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ దేశాల్లో సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 2026 మార్చి 2వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డాక్టర్ సన్యం భరద్వాజ్ సర్క్యులర్ జారీ చేశారు.
కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మార్చి 5వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలపై మార్చి 3న సమీక్ష నిర్వహించి తగిన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, పాఠశాలలు అధికారిక ప్రకటనలను గమనిస్తూ, తాజా సమాచారం కోసం తమ స్కూళ్లతో నిరంతరం సంప్రదింపులు జరపాలని సూచించారు.
Read Also: యాదాద్రిలో ఘోరం.. సుత్తితో కొట్టి భర్తను చంపిన భార్య
Follow Us On: Sharechat

