Mobile Popup Ad
Mobile Popup Ad

భగ్గుమన్న తెలంగాణ.. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ (Telangana) నిప్పుల కుంపటిలా మారుతోంది. భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో బయటకు రావాలంటేనే, భయపడిపోతున్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా మెండోరాలో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, నిర్మల్, సిద్ధిపేట, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 45 డిగ్రీల వరకు నమోదైంది. రాబోయే రోజుల్లో వడగాలుల ప్రభావం మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం..

రేపు పలు జిల్లాల్లో మధ్యాహ్నం తరువాత ఉష్ణోగ్రతలు తగ్గి.. సాయంత్రానికి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మ, వరంగల్ జిల్లాలతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. రాబోయే రెండు రో జుల్లో హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం అక్కడకక్కడ వానలు పడబోతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>