కలం డెస్క్ : Tere Ishk Mein Teaser | మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టడానికి తమిళ స్టార్ ధనుష్ రెడీ అవుతున్నాడు. ‘అతరంగీ రే’ సినిమాతో బాలీవుడ్‌లో స్టార్ డమ్ సంపాదించిన ధనుష్.. ఇప్పుడు ‘తేరే ఇష్క్ మే’ సినిమాతో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులున పలకరించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ధనుష్ యాక్టింగ్‌కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. అదే విధంగా టీజర్ కట్ అద్భుతంగా ఉందని, సినిమాపై అంచనాలను అంతకంతా పెంచుతోందని ప్రేక్షకులు చెప్తున్నారు. ఇందులో ధనుష్ సరసన కృతిసనన్ నటిస్తోంది. ఇందులో ధనుష్.. ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కానుంది.
ఈ టీజర్‌లో ధనుష్.. ఎమోషన్స్‌ను అద్భుతంగా కనబరిచాడు. ప్రేమలో మోసపోయిన వ్యక్తి ఆవేదనను ధనుష్ తనదైన స్టైల్‌లో చూపించాడు. ‘నా తండ్రి అంత్యక్రియలు జరపడానికి బనారస్ వెళ్లాను.. నీ కొత్త జీవితం కోసం పవిత్ర గంగాజలం తెచ్చా. కనీసం నీ పాపాలు కడుక్కో’ అని కృతితో చెప్పే డైలాగ్.. టీజర్‌లో హైలెట్‌గా మారింది. ఆ డైలాగ్ అనంతరం బాటిల్‌లోని నీటిని కృతిసనన్ తలపై పోయడంతో సినిమాలో ఏదో కీలక మలుపు ఉంటుందని అనిపిస్తోంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే నవంబర్ 28 వరకు ఆగాల్సిందే.

