Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో భారీ వర్షం.. హైదరాబాద్​ సహా జిల్లాల్లో కుండపోత!

క‌లం, వెబ్ డెస్క్: ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఊరట కలిగిస్తూ తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీగా వర్షం (Rains) పడుతోంది. హైదరాబాద్​ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షంతో హైదరాబాద్ ​(Hyderabad)లోని రోడ్లన్నీ జలమయమైపోయాయి. వర్షం ఎఫెక్ట్​తో పలు చోట్ల ట్రాఫిక్​కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్‌ సిటీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

మియాపూర్​, చందానగర్​, కూకట్​పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌, పంజాగుట్టలో ఎడతెరిపిలేని వానతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి చూస్తే సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్‌, వరంగల్​లో వాన దంచికొడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>