కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపల్లె అసెంబ్లీ నియోజవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావును (Mopidevi Srinivasa Rao) పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై విచారణ చేపట్టిన వైసీపీ పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్సు చేసింది. ఇక కమిటీ సిఫార్సుల మేరకు మోపిదేవి శ్రీనివాసరావును పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రద్దు చేస్తున్నట్లు వైసీపీ అధిష్టానం స్పష్టం చేసింది. కాగా, ఆయన ఐదు నెలల క్రితమే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. అయితే ఐదు నెలల్లో మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ అధిష్టానం వేటు వేయడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

