కోరుట్లలో దారుణం.. అంగన్వాడీ కార్యకర్త దారుణ హత్య

కలం, కోరుట్ల: జగిత్యాల(Korutla Murder ) జిల్లా కోరుట్ల పట్టణంలో బుధవారం ఉదయం దారుణ హత్య చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రకాశం రోడ్డులో నివాసం ఉంటున్న అంగన్వాడీ కార్యకర్త అన్నం లక్ష్మి (45) దారుణంగా హత్యకు గురయ్యారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… ప్రకాశం రోడ్డు సమీపంలోని తన నివాసంలో లక్ష్మి ఉండగా బుధవారం ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఆమె భర్త కుటుంబ తగాదాల కారణంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడైన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.

ఉదయాన్నే ఇంట్లోంచి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా, లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కోరుట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

​కేసు నమోదు – విచారణ ప్రారంభం

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల పూర్తి కారణాలు, కుటుంబ వివాదాల వెనుక ఉన్న వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆమె భర్త నరేష్ టవల్‌తో చుట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం నరేష్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నరేష్ విద్యుత్ శాఖలో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ​ఈ దారుణ ఘటనతో కోరుట్ల పట్టణంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు, విషాద ఛాయలు అలముకున్నాయి. బాధ్యుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>