ఇండిగో వెబ్‌సైట్ క్రాష్‌.. ప్ర‌యాణికుల‌కు స‌మ‌స్య‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ముఖ విమాన‌యాన సంస్థ ఇండిగో (IndiGo) అధికారిక వెబ్‌సైట్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. టికెట్ బుకింగ్స్‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌యాణికుల‌కు క‌లుగుతున్న అసౌక‌ర్యంపై సంస్థ అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందించింది. ప్రస్తుతం సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్ సేవలను పొందడంలో వినియోగదారులకు కొంత ఇబ్బంది కలుగుతోంద‌ని పేర్కొంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు త‌మ టెక్నిక‌ల్ టీమ్ పని చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌యాణికుల అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌యాణికులు హెల్ప్ లైన్ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు.

Also Read : ఝలక్ ఇస్తారా.. సర్దుకుపోతారా : రాజగోపాల్ రెడ్డి డుమ్మాల వెనుక అసలు కథ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>