కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో భారీ వర్షం పడుతోంది. గత రెండు గంటలుగా కురుస్తున్న వానలకు నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. కొన్ని ఇళ్లు నీట మునుగుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో పలు చోట్ల కరెంట్ సరఫరా నిలిపేశారు. ఉదయం నుంచి ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలు చల్లటి వానలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. మరోవైపు, వర్షాల నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. రోడ్లపై వరద నిలిచిపోకుండా.. చర్యలు చేపట్టారు. గత వారం కురిసిన వర్షాలకు పలు చోట్ల విద్యుత్తు తీగలు, చెట్ల కొమ్మలు విరిగిపడిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సూచించారు.
Read Also: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

