కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ (Mega DSC) నియామకాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ (YS Jagan) చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, “జగన్ రెడ్డి గారి తప్పుడు కథనం ఇప్పుడు పూర్తిగా బహిర్గతమైంది. ఆయన చేసిన ప్రతి ఆరోపణను వాస్తవాలు, గణాంకాలు ఖండించాయి. కోర్టులు కూడా ఈ ఆరోపణలను కొట్టివేశాయి” అని పేర్కొన్నారు.
డీఎస్సీ నియామక ప్రక్రియపై మొదటి నుంచి ప్రభుత్వం చెప్పినదే నిజమని.. ఇప్పుడు నిరూపితమైందని లోకేశ్ తెలిపారు. ప్రస్తుతం డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా న్యాయబద్ధంగా కొనసాగుతోందని, వేలాది మంది అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని తెలిపారు. అలాగే, లక్షలాది అభ్యర్థులను తప్పుదోవ పట్టించి, అవసరం లేని ఆందోళనకు గురిచేసినందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం తగదని హెచ్చరించారు.
Read Also: జగన్ టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయం: కొడాలి నాని
Follow Us On: Instagram

