Mobile Popup Ad
Mobile Popup Ad

మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్ 2 వ్యాధితో బాధపడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది చిన్నారి ఆర్యాన్ష్ కి సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. జూన్ 20 లోపు సదరు చిన్నారికి కోటిన్నర విలువ గల ఇంజెక్షన్ అత్యవసరమని సోషల్ మీడియా ద్వారా వచ్చిన విజ్ఞప్తికి సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తమ ప్రభుత్వం చిన్నారి ఆర్యాన్ష్‌కు ఉత్తమ చికిత్సను అందిస్తుందని.. సీఎంఆర్ఎఫ్ (CMRF) బాధ్యతలు చూస్తున్న సీఎంఓ అధికారి వెంటనే తల్లిదండ్రులను సంప్రదిస్తారని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సీఎంవో అధికారులు  చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారని ట్వీట్ చేశారు.

నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది చిన్నారి ఆర్యాన్ష్ ఎస్ఎంఏ టైప్ 2 అరుదైన జన్యుపరమైన నరాల సంబంధిత వ్యాధి బారినపడ్డాడు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే చిన్నారి ప్రాణరక్షణకు రూ. 1.5 కోట్ల విలువ గల ఇంజెక్షన్లు అవసరమని.. ఆ ఖర్చును భరించే స్థోమత సదరు కుటుంబానికి లేదని కొందరు సోషల్ మీడియా ద్వారా సీఎం రేవంత్ (CM Revanth Reddy) రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే మానవత్వంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. చిన్నారికి అవసరమైన చికిత్సను అందించే ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. చిన్నారికి అవసరమైన చికిత్స జరిగి దీర్ఘాయువు కలగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

Read Also: మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు కీలక సూచన.. పిటిషన్ తిరస్కరణ..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>