కలం, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సభకు వర్షం ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఉద్దంపూర్ ప్రాజెక్ట్ సమీపంలో ముఖ్యమంత్రి భారీ బహిరంగసభకు ఏర్పాటు చేశారు. కాగా శుక్రవారం మధ్యాహ్నం సడెన్ గా ఇక్కడ భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
ఈదురుగాలుల కారణంగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కుర్చీలు చెల్లాచెదురయ్యాయి. కటౌట్లు కూడా గాలికి ఎగిరిపోయాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారడంతో సభ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. హెలిప్యాడ్ వద్ద కూడా నీరు చేరుకున్నట్టు తెలుస్తోంది. దీంతో సీఎం సభ జరుగుతుందా లేదా ఆలస్యం అవుతుందా? అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ సభా ప్రాంగణాన్ని తిరిగి సరిచేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సభా ప్రాంగణాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. వాతావరణం అనుకూలిస్తే సభను యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వట్టెం రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గంలో జడ్చర్ల సభకు చేరుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా పాలుమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్లను పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వట్టెం రిజర్వాయర్ పనులను పరిశీలించిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకొనే అవకాశం ఉంది.
Read Also: పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదు : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

