సోన్ గురుకులంలో స్పీచ్ థెరపీ స్క్రీనింగ్ క్యాంప్

కలం, సోన్ : సోన్ (Soan) మండల కేంద్రంలోని అభ్యాస గురుకులం పాఠశాలలో విద్యార్థులకు నేత్ర, దంత పరీక్షలతో పాటు స్పీచ్ థెరపీ స్క్రీనింగ్ క్యాంప్‌ను (Health Screening Camp) శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేత్ర వైద్యులు కృష్ణంరాజు, దంత వైద్యులు వెంకటరమణ, జయశ్రీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్పీచ్ థెరపీ స్క్రీనింగ్‌ను డాక్టర్ సతీష్ చేపట్టారు.

ఈ సందర్భంగా వైద్యులు విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. టీవీ, మొబైల్ ఫోన్లను ఎక్కువసేపు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జంక్‌ఫుడ్, చాక్లెట్లు, స్వీట్లు అధికంగా తీసుకోకుండా ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అలాగే డీజేలు, ఇతర భారీ శబ్దాలకు దూరంగా ఉండాలని, వినికిడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>