నల్లగొండ రెడ్ క్రాస్ ఎన్నికలకు నామినేషన్ల వెల్లువ

కలం, నల్లగొండ: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ (Nalgonda) జిల్లా శాఖ (2026-2029) నూతన పాలకవర్గం ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించనున్న ఈ ఎన్నికలకు (Red Cross Elections) శనివారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా సహకార అధికారి కార్యాలయంలో ఎన్నికల అధికారి టి. మమత నామినేషన్లను స్వీకరించారు. 15 మంది సభ్యులతో కూడిన మేనేజింగ్ కమిటీ స్థానాలకు లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి నేతృత్వంలోని ప్యానెల్ నుంచి 16 మంది, ఇతరుల నుంచి 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 33 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

నల్లగొండ రెడ్ క్రాస్ చరిత్రలో ఒక ఎన్నిక కోసం ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు రావడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. సోమవారం నామినేషన్ల పరిశీలన, మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఉపసంహరణ అనంతరం తుది పోటీ ఖరారు కానుంది. ఏకగ్రీవం కాని పక్షంలో ఈ నెల 11న జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా సహకార అధికారి పర్యవేక్షణలో జరిగే పోలింగ్‌లో విజయం సాధించిన 15 మంది మేనేజింగ్ కమిటీ సభ్యులు అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారి, స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>