Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌

కలం, వెబ్ డెస్క్: రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్‌ (Harivansh Narayan) ఎన్నికయ్యారు. మూడోసారి రాజ్యసభ ఉపసభాపతిగా ఎన్నికైన హరివంశ్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హరివంశ్ అనుభవం పెద్దల సభకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. మూడోసారి ఎన్నికైన హరివంశ్ నారాయణ్‌కు చట్ట సభల్లో చాలా అనుభవం ఉందని చెప్పారు. డిప్యూటీ స్పీకర్‌‌గా ఎన్నికైన హరివంశ్‌ ప్రతిపక్షానికి తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అభిప్రాయపడ్డారు.

ఏప్రిల్ 9న హరివంశ్ పదవీకాలం ముగిసింది. దీంతో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఖాళీ అవడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే ఆయన రాజ్యసభకు నామినేట్ అయ్యారు. హరివంశ్ (Harivansh Narayan) ఏప్రిల్ 10న ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లో భాగంగా శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి హరివంశ్‌కు ఛాన్స్ దక్కింది.

Read Also : మోదీకి భయపడి తెలంగాణ ఎంపీలు నోరు మూసుకున్నారు: కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>