Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంత అప్పు ఉందో తెలియదా?: హరీశ్ రావు

కలం మెదక్ బ్యూరో: సీనియర్ మంత్రి అని చెప్పుకునే జూపల్లి కృష్ణారావుకు తమ ప్రభుత్వ ఎంత అప్పు చేసిందో కూడా తెలియదా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. అప్పుల వివరాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, జూపల్లి నిన్న గోల్ కొడదామనుకుంటే.. అది కాస్తా సెల్ఫ్ గోల్ అయిందని కౌంటర్ ఇచ్చారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే మంత్రి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టారని విమర్శించారు.

ఎవరి లెక్కలు నిజం..

సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నాలుగు నెలల కిందట అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన అప్పుల లెక్కలు నిజమా?.. లేక ఇప్పుడు మంత్రి చెబుతున్న లెక్కలు నిజమా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ప్రశ్నించారు.

మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి..

జూపల్లి నిజంగా పాలమూరు బిడ్డ.. పౌరుషం ఉంటే తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నందుకు వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, శశిధర్ రెడ్డి, మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>