రైతులను మరోసారి మోసం చేయొద్దు.. సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర రైతులను మరోసారి మోసం చేయొద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిన్న చూపు తగదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిద్ధిపేట జిల్లా కలెక్టర్, జిల్లా నియోజకవర్గ వ్యవసాయ అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. వడగండ్ల వర్షాలకు పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని అధికారులకు హరీశ్ రావు సూచించారు. రైతు భరోసా ఇవ్వక, పంట నష్టం పరిహారం ఇవ్వక అన్నదాతలను ప్రభుత్వం ఆగం చేస్తోందన్నారు. గతంలో ముగ్గురు మంత్రులు వచ్చి దెబ్బ తిన్న పంటలను పరిశీలించినా.. నేటి వరకు ఒక్క రూపాయి పరిహారం అందించలేదని మండిపడ్డారు.

నేటికీ పంట నష్ట పరిహారం చెల్లించలేదు..

రైతులకు రైతు భరోసా ఇవ్వక, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వక, ముగ్గురు మంత్రులు వచ్చి హామీ ఇచ్చిన నేటికీ పంట నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. ఐదు విడతల్లో పంట నష్ట పరిహారం ఇవ్వకుండా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. బడ్జెట్ లో పెట్టి పంట బీమా ఇవ్వకుండా రైతులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇప్పటికి వడగండ్ల వానలతో ఐదు సార్లు, ఒకసారి తుఫాన్ తో పంట నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు విడుతల్లో పంట నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు అమ్ముకోడానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడిచి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ప్రతి గింజని ప్రభుత్వం కొనాలని, అదేవిదంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, మిలర్స్ తో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేసి పంపిణీ చేయాలని కోరారు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. రైతులు అధైర్య పడొద్దని.. అండగా తాను ఉన్నానని హరీష్ రావు (Harish Rao) భరోసా కల్పించారు.

Read Also: ‘మీ టికెట్’ యాప్‌తో ఎన్నో సర్వీసులు.. త్వరలోనే మరిన్ని సేవలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>