సాగునీరు అడిగితే అక్రమ కేసులా..? కాంగ్రెస్​ పై హరీశ్​ రావు ఫైర్​

కలం, వెబ్​ డెస్క్​ : పంటలు ఎండిపోతుంటే సాగునీరు ఇవ్వాలని నిలదీసిన రైతులపై అక్రమ కేసులు బనాయిస్తారా అని బీఆర్ఎస్​ నేత హరీశ్​ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాలోని జూరాలా ప్రాజెక్టు (Jurala Project) ఎడమ కాలువ పరిధిలోని పంటలకు నీళ్లు ఇవ్వాలని సెప్టెంబర్​ 19న రైతులు నిరసన తెలిపారు. నీళ్లివ్వాలని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చిన స్పందించలేదు. దీంతో రైతులు ప్రాజెక్టు ఎడమ కాలువ గేట్లు ఎత్తి స్వయంగా నీళ్లు విడుదల చేశారు. ప్రాజెక్టు ఇరిగేషన్​ డీఈ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారంటూ హరీశ్​ రావు ఎక్స్​ వేదికగా ఫైర్ అయ్యారు.

కళ్ల ముందే పంటలు ఎండుతుంటే నీళ్లు ఇవ్వాలని ఆందోళన చేసిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమైన చర్య అని హరీశ్​ రావు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్​ రెడ్డి పాలనలో రైతుల చేతులకు బేడీలు, కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇంజనీర్లతో రైతులపై కేసులు పెట్టించడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అయ్యారు. ప్రభుత్వం చేతగాని తనం వల్లే పంటలు ఎండిపోతున్న దుస్థితి ఏర్పడిందని హరీశ్​ రావు ఆరోపించారు.

నీళ్ల కోసం రోడ్డొక్కి నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. కృష్ణా నదిలో నీటి ప్రవాహాలు ఉన్నప్పుడు నీటిని లిఫ్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారని హరీశ్​ రావు (Harish Rao) ఆరోపించారు. రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. రైతు వ్యతిరేక చర్యలు ఇలాగే కొనసాగిస్తే.. పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తప్పదని హరీశ్​ రావు హెచ్చరించారు.

Also Read : ప్రపంచ టెక్నాలజీకి భారత్ వేదిక కావాలి : ప్రధాని మోదీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>