కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Madhira Degree College) లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ సంప్రదాయాలను, సాంస్కృతిక వారసత్వాన్ని విద్యార్థులు కాపాడుతూ భావితరాలకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కమిటీ సభ్యులు ఎస్. ఇందిర, పి. సుజాత, అధ్యాపకులు పి. లక్ష్మీనారాయణ, వి. నాగరాజు, ఎం.వి.ఎస్. శర్మ, పి. శ్రీనివాస్, షేక్ ఇమ్రాన్, ఎస్. జ్యోతి, టి. ఆదర్శ్, ఎస్. పృథ్వీరాజ్, పి. నాగేశ్వరరావు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read : సాగునీరు అడిగితే అక్రమ కేసులా..? కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్
Follow Us On: X(Twitter)

