భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ రాజర్షిషా.

కలం, ఆదిలాబాద్ : నార్నూర్‌ మండలంలో కొనసాగుతున్న సమగ్ర భూముల రీ-సర్వే, ఎన్‌మెంట్‌ సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. బుధవారం నార్నూర్‌ మండలంలోని గంగాపూర్ (జి) గ్రామంలో భూ రీసర్వే (Land Resurvey) పక్రియను ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్‌తో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు దిశనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీసర్వే పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

గంగాపూర్, మాదాపూర్, ఖైర్దట్వా, సోనాపూర్ గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను తలపెట్టగా, ప్రస్తుతం గంగాపూర్ పరిధిలో సర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ రీ-సర్వేలో భాగంగా ఇప్పటివరకు 6 కిలోమీటర్ల మేర హద్దుల గుర్తింపు పూర్తయిందనీ తెలిపారు. ఈ ప్రక్రియలో భాగంగా కలెక్టర్ స్వయంగా గంగాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 2 భూములను, గ్రామ కంఠాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్ పరికరం పని విధానం, బౌండరీ హద్దులు ఎలా నిర్ధారించారు.

డేటా ఫీడింగ్ సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ప్రభుత్వ భూములకు తొలి ప్రాధాన్యతనిచ్చి సర్వే పూర్తి చేసి, అన్ని వివరాలు డేటాను జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఉట్నూర్ సబ్ కలెక్టర్ ప్రణయ్ కుమార్, తహసిల్దార్ రాజలింగు, ఎంపిడిఓ పుల్లయ్య, సర్పంచ్ ఉష, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జయరాం, సర్వేయర్లు, ఇతర అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>