కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన రైతు బంధు నిధులు తక్షణమే వారి ఖాతాల్లో జమ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. హరీశ్ రావు గురువారం గజ్వేల్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల (municipal elections) ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని రైతు బంధు గురించి ప్రశ్నిస్తే ఎన్నికల తర్వాత వేస్తామని చెప్తున్నాడని అన్నారు. కరోనా సమయంలో కేసీఆర్ హయాంలో ఎన్నో పనులు చేశామని, రైతుబంధు డబ్బులు కూడా ఆపలేదని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా ఆగని రైతుబంధు ఇప్పుడు ఎందుకు ఆగిందని ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్ (KCR) డిసెంబర్‌లోనే రైతుబంధు అందించే వాడని, ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చినా అందడం లేదని తెలపారు. ఇది మోసం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రెండు రైతుబంధులు ఎగ్గొట్టాడని, ఇది మూడవదని హరీశ్ తెలిపారు. రైతుబంధు నిధులు జమ చేయడంపై తమకు అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తామని, గత పెండింగ్ రైతు బంధులతో పాటు ఇప్పటిది కలిపి మొత్తం మూడు రైతు బంధు నిధులు రైతులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి హార్వర్డ్ పర్యటనపై హరీశ్ రావు సెటైర్లు వేశారు. హర్వర్డ్ వెళ్లినా, అంతరిక్షం వెళ్లినా కుక్క తోక వంకరేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతులు తప్ప ఇంకా ఏమైనా వచ్చా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. అమరులు, యువత, ప్రజలు ఎంతోమంది పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? అని ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ సాధించాడు కాబట్టే నేడు సీఎంగా రేవంత్ కుర్చీలో కూర్చున్నాడన్నారు. కేసీఆర్ ముమ్మాటికీ జాతి పిత అని, రేవంత్ బూతు పిత అని హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు.
Read Also: రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పీఠం కేసీఆర్ పెట్టిన భిక్ష
Follow Us On: Pinterest


