జగన్ ఎదుటే రాయలసీమ లిఫ్ట్‌ను కేసీఆర్ వ్యతిరేకించారు: హరీశ్

కలం, వెబ్ డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎదుటే కేసీఆర్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వ్యతిరేకించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ భవన్ లో పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇదే ప్రాజెక్టుపై 2020లో కేంద్రమంత్రి షెకావత్ సాక్షిగా జగన్ ను ఎదురుగా కూర్చోబెట్టి హెచ్చరించినట్లు తెలిపారు.

“బిడ్డా నువ్వు రాయలసీమ లిఫ్ట్ ఆపకపోతే ఆలంపూర్ దగ్గర బ్యారేజీ కట్టి నీళ్లు రాకుండా చేస్తా” అని కేసీఆర్ ఆనాడే స్పష్టంగా చెప్పారని హరీశ్ రావు తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే కేసీఆర్ ఆ ప్రాజెక్టును ఒప్పుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఏడేళ్లయినా కృష్ణా ట్రిబ్యునల్ వేయడం లేదని కేసీఆర్ కేంద్ర మంత్రిని నిలదీశారని అన్నారు.

కృష్ణాజలాల్లో తెలంగాణకు నీటి అన్యాయంపై ఉరి వేయాల్సింది సీఎం రేవంత్ రెడ్డిని, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటూ హరీశ్ రావు దుయ్యబట్టారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి ఏపీ నీళ్లు తీసుకుపోతుంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోయినందుకు రేవంత్ రెడ్డిని ఉరి వేయాలన్నారు. కల్వకుర్తిలో, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా 24 గంటలు మోటార్లు నడపకుండా 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీలోని కుప్పంకు నీళ్లు పంపించినందుకు ఉరి వేయాలని ఫైర్ అయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>