తమిళనాడులో దీపం వివాదం.. టెన్షన్ వాతావరణం!

కలం, వెబ్ డెస్క్: తమిళనాడులోని మధురైలో ఉన్న తిరుప్పరంకుండ్రం (Thiruparankundram)  కొండపై దీపం వెలిగించే విషయంలో వివాదం కొనసాగుతోంది. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని, ఈరోజు ఒక్కసారి దీపం వెలిగించుకోవచ్చని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అలా చేస్తే అవవసర గొడవలు జరిగే అవకాశం ఉందని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఆదేశాలతో సాయంత్రం 6 గంటలకు దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎలాంటి గొడవలు జరగకుండా.. సుమారు 5 వేల మంది పోలీసులను కొండ చుట్టూ మోహరించారు. మరోవైపు కొండ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మధురై బెంచ్ కోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు అమలు చేయాలని.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని మధురై కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను హెచ్చరించింది. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

ఎందుకీ వివాదం..

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపతూన్ అనే స్తంభంపై ఏటా కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే కొండపై 50 మీటర్ల దూరంలో సికిందర్ బాద్ షా దర్గా కూడా ఉంది. ఈ కొండపై తమకే హక్కులున్నాయని దర్గా నిర్వాహకులు వాదిస్తున్నారు. దీంతో ఇది చివరికి హిందూ, ముస్లింల మధ్య వివాదంగా మారింది. ఈ క్రమంలోనే ఇక్కడ దీపం వెలిగించడానికి నిరాకరిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఉచ్చిపిళ్లయార్ ఆలయంలోనే దీపం వెలిగిస్తున్నారని పేర్కొంది. దీపతూనే స్తంభం సర్వే కోసం ఏర్పాటు చేసిన రాయి మాత్రమేనని మధురై కలెక్టర్ హై కోర్టుకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే గొడవలు జరగకుండా ఇక్కడ భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఈ వివాదం ఇంకా సుప్రీం కోర్టులోనే విచారణ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>