కలం, వెబ్‌డెస్క్ : మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) యువతకు సందేశం ఇచ్చారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని, మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో 2026 నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో ‘వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’(Nasha Mukt Bharat) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు మూడు రోజుల పాటు ఈ అవగాహన నడక కొనసాగనుంది. డ్రగ్స్ దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ సామాజిక ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ప్రభాస్ మద్దతుతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

