ఏపీ ఎన్నిక‌ల అధికారుల‌కు షాకిచ్చిన వైసీపీ

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు వైసీపీ (YSRCP) లీగల్ నోటీసులు జారీ చేసింది. వైసీపీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మెహఫూజ్ నజ్కీ ఈ నోటీసులు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అక్టోబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అభ్యర్థులందరికీ ఎటువంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాలని, నామినేషన్ల అడ్డగింతలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఈ నోటీసుల్లో ఈసీని కోరారు.

ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారని వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నామినేషన్ కేంద్రాల వద్ద అధికార పార్టీ శ్రేణులతో కలిసి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది. న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తూ లాఠీఛార్జ్‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఎలాంటి కార‌ణాలు లేకుండా అర్ధరాత్రి ఇళ్ల‌ల్లోకి వ‌చ్చి అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కనీసం స్పందించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు, దాడులను తక్షణమే అడ్డుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అధికారులను వైసీపీ హెచ్చ‌రించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>