కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీకి వెళ్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని రక్తాలు వచ్చేలా కొట్టారని హరీశ్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. జగదీష్ రెడ్డి కాలికి గాయమైందని, కేటీఆర్ కూడా స్వల్పంగా గాయపడ్డారని వివరించారు. మహిళా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చీర లాగారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకుని పార్లమెంటుకు వెళితే తప్పు లేదు కాదు కానీ, తాము అసెంబ్లీకి రావడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తామనే బయటనే అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతోనే పోలీసులు రెచ్చిపోయారని, అందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.
మేం లేకుండా చర్చనా..?
అసెంబ్లీలో తాము లేకుండానే 22ఏ అంశంపై ఎలా చర్చ చేస్తారని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. అసలు బీఏసీ సమావేశం ఎప్పుడు జరిపారని.. ప్రధాన ప్రతిపక్షాన్ని సంప్రదించకుండానే సభ ఎన్ని రోజులు జరపాలనేది ఎలా నిర్ణయిస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టబోమన్నారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ (Fee Reimbursement) విడుదల కాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.
Also Read : స్పీకర్, పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

