ఆ అవినీతిని బయటపెడుతా.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ ఇండియా స్కూల్స్‌లో (Young India Schools) భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నాయని, త్వరలో బయట పెడుతానని తెలిపారు. ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారనే విషయమై తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పట్టు రావడం లేదని, ప్రతిపక్షంగా మేం సక్సస్ అయ్యామని హరీశ్ రావు అన్నారు.

‘‘ఖమ్మంకు కేటీఆర్ (KTR) వెళ్ళాడు. ఇప్పుడు ఇండ్లు కట్టిస్తాం అన్నారు. నేను శారదా పీఠం వెళ్ళాను. అది ఆపుతున్నాం అన్నారు. దేవాదుల ప్రాజెక్టు వెళ్లాం. వెంటనే ముఖ్యమంత్రి వెళ్లాడు. ప్రతి దానికి మేం వెళ్ళాక స్పందిస్తున్నారు. జర్నలిస్టుల హెల్త్ స్కీంను గాలికి వదిలేశారు. మేము ఉన్నప్పుడు ప్రత్యేక జీవో ఇచ్చాం. ఉద్యోగులకు ఎలా ఉండేదో, అలానే జర్నలిస్టులకు ఉండేది’’ అని హరీశ్ రావు గుర్తుచేశారు.

‘‘రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మేనల్లుడి మనుషులు నియో పోలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే నిబంధనలుండగా ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ నియో పోలీస్‌లో పెట్టారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలి. లెటర్‌లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోంది. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారు. అక్కడ రెడీమిక్స్‌కు పర్మిషన్ లేదు’’ అని హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు.

Read Also: నాలుగు దేశాలకు స్టూడెంట్​ వీసా బంద్​ : యూకే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>