ఖాళీగా కూర్చునే ఉద్యోగం.. నెలకు 80వేల డాలర్లు

కలం, వెబ్ డెస్క్ : మనసుండాలే గానీ సంపాదనకు మార్గాలు అనేకం అని ఎంతో మంది నిరూపిస్తున్నారు. పెద్ద చదువులు ఉన్నా సరైన జాబుల్లేక ఇండియాలో ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలిసిందే. జపాన్ కు (Japan Man)  చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎలాంటి జాబు చేయట్లేదు కానీ నెలకు 80వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా.. అతను కేవలం తోడుగా ఉండటం కోసం ఇంత మొత్తంలో సంపాదించేస్తున్నాడు.

జపాన్ కు చెందిన షోజి మోరిమోటో (Japan Man) వయసు 41 ఏళ్లు. తనను తాను అద్దెకు ఇచ్చుకుంటున్నాడు. ఎవరైనా తినడానికి లేదా తమతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి.. లేదా సైలెంట్ గా తమ పక్కన కూర్చోడానికి షోజిని బుక్ చేసుకుంటారు. అలా ఇతన్ని గంటసేపు బుక్ చేసుకున్నందుకు 65 నుంచి 195 డాలర్లు చెల్లించాలి. అతను ఎలాంటి ఫిజికల్ వర్క్ చేయడు. అలాగే జర్నీలు కూడా చేయడు. కేవలం పక్కన కూర్చుని తిన్నందుకు లేదా సైలెంట్ గా ఉన్నందుకే ఈ డబ్బులు పే చేయాలి. జపాన్ లో ఇలా తమను తాము రెంట్ కు ఇచ్చుకునే వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. ఎందుకంటే జపాన్ లో అందరూ ఫుల్ బిజీబిజీ లైఫ్ గడిపేస్తుంటారు. ఒకరికి ఒకరు తోడుగా రెస్టారెంట్లకు లేదా కాసేపు టైమ్ స్పెండ్ చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటి వారి కోసమే షోజి లాంటి వారు ఉంటున్నారు. షోజి గతంలో జాబ్ చేసినా.. అది నచ్చక మానేసి ఇలా కంపెనీ ఇస్తూ ఇతరులకు లోన్లీ అనే ఫీల్ రాకుండా సాయం చేస్తున్నట్టు తెలిపాడు.

Read Also: నాలుగు దేశాలకు స్టూడెంట్​ వీసా బంద్​ : యూకే

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>