కలం, వెబ్ డెస్క్: యూకే ప్రభుత్వం నాలుగు దేశాలకు స్టూడెంట్ వీసాలు బంద్ చేసింది (UK Bans Student Visas). తమ దేశంలో అక్రమంగా నివాసం ఉండేందుకు ఈ వీసాలను బ్యాక్డోర్లాగా వాడుకుంటున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపింది. ఇటీవల శరణార్థి దరఖాస్తులు ఎక్కువ కావడంపై దర్యాప్తు చేయగా, ఈ విషయం బయటపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్, కామెరూన్, మయన్మార్, సుడాన్ దేశాలకు స్టూడెంట్ వీసాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌కు స్కిల్డ్ వర్కర్ వీసాను కూడా బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది.
కాగా, వీసాల దుర్వినియోగం అడ్డుకునేలా ఇటీవల యూకే హోం సెక్రెటరీ షబానా మహ్మూద్ పార్లమెంట్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో మార్పులు తెస్తూ, అందులో భాగంగా ఈ నాలుగు దేశాలపై స్టూడెంట్ వీసా బ్యాన్ (UK Bans Student Visas) చేశారు. ఇది ఈ నెల 26 నుంచి అమల్లోకి వస్తుంది.
Read Also: అంగరంగ వైభవంగా ‘విరోష్’ రిసెప్షన్.. హాజరైన సినీ ప్రముఖులు
Follow Us On: Sharechat

