హార్దిక్ పాండ్య కోసం 7 జట్ల పోటీ.. రేసులో సీఎస్‌కే ముందంజ?

కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ముంబై ఇండియన్స్‌ను (Mumbai Indians) వీడాలని స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య పోటీ నెలకొంది. 32 ఏళ్ల పాండ్య కోసం మొత్తం ఏడు జట్లు ఆసక్తి చూపుతున్నట్లు క్రికెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ రేసుకు దూరంగా ఉన్నట్లు సమాచారం.

మొదట్లో నిశ్శబ్దంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కూడా ఇప్పుడు పాండ్య కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR), రాజస్థాన్ రాయల్స్ (RR) కూడా అతడిని తమ జట్టులోకి తీసుకురావాలని ఆసక్తి చూపుతున్నాయి. ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్‌కేలో కీలక ఆటగాడిగా పాండ్యను భావిస్తున్నప్పటికీ, కెప్టెన్సీపై మాత్రం స్పష్టత లేదని సమాచారం. మరోవైపు కేకేఆర్ కొత్త కెప్టెన్ కోసం అన్వేషిస్తుండగా, రాజస్థాన్ రాయల్స్ మాత్రం నాయకత్వ బాధ్యతలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా పాండ్యకు కీలక పాత్ర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, కేకేఆర్ మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

అయితే ఇప్పటివరకు ఏ ఫ్రాంచైజీ కూడా అధికారిక ప్రకటన చేయలేదు. ఆటగాళ్ల మార్పిడి నగదు రూపంలో జరుగుతుందా లేదా మరో ఆటగాడిని ట్రేడ్‌లో భాగంగా పంపిస్తారా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఈ ట్రేడ్‌లో హార్దిక్ పాండ్య అంగీకారమే కీలకంగా మారనుంది. కెప్టెన్సీ లేకుండా కొత్త జట్టులో చేరేందుకు అతడు సిద్ధంగా ఉంటాడా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌లోని మరో భారత స్టార్ ఆటగాడి భవిష్యత్తుపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. పాండ్య (Hardik Pandya) ట్రేడ్ పూర్తయిన తర్వాతే ఆ అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>