కలం, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.శ్వేతను (Warangal CP Swetha) హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ (Collector Chahat Bajpai) మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖతో సమన్వయంతో పనిచేయడానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.

