బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

కలం, నిర్మల్ : బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు సంబంధించిన పెండింగ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా (Nirmal) కేంద్రంలోని రవి, వశిష్ట, విజయ పాఠశాలలకు సంబంధించిన గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల కాకపోవడంతో దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్, హాస్టల్ వసతి వంటి మౌలిక సదుపాయాలు సక్రమంగా అందక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం నుంచి వశిష్ట, విజయ పాఠశాలలు వైదొలిగాయని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.230 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరారు.

Read Also: ఎరుపెక్కిన ఆకాశం.. మరో విలయానికి సంకేతమా?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>