కలం, స్పోర్ట్స్ : 15 ఏళ్ల యంగ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని (Vaibhav Suryavanshi) ఆపడం ఇప్పుడు బౌలర్లకు పెద్ద సవాలుగా మారింది. అతడిని కట్టడి చేయాలంటే డిఫెన్స్ వద్దని, దాడి చేసి వికెట్ తీయడమే ఒకే ఒక్క మార్గమని భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ (Harbhajan Singh) స్పష్టం చేశారు. వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచంలో వేగంగా ఎదిగాడు. 2025లో 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.
గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే శతకం బాది, పురుషుల టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత 15 ఏళ్ల 99 రోజుల వయసులో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర రాశాడు. అంత చిన్న వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను ఆధిపత్యం చేసే ఆటగాడిని తాను ఇంతవరకు చూడలేదని హర్భజన్ (Harbhajan Singh) అన్నారు.
ఐపీఎల్‌లో బుమ్రా, ప్యాట్ కమిన్స్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు వేసిన తొలి బంతులనే వైభవ్ సిక్సర్లుగా మలిచాడు. అగ్రశ్రేణి బౌలర్లు కూడా అతడికి ఎక్కడ బౌలింగ్ చేయాలో ఆలోచించేలా చేయడం గొప్ప విషయమని హర్భజన్ వ్యాఖ్యానించారు. అటువంటి ఆటగాడి నుంచి తప్పించుకోవడానికి దాడి మాత్రమే ఏకైక మార్గమని హర్భజన్ సూచించారు. వైభవ్ బ్యాటింగ్‌ను బట్టి కాకుండా, తన ప్రణాళిక ప్రకారమే పవర్‌ప్లేలో ఫీల్డింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. పరుగులను నియంత్రించేందుకు బౌలింగ్ చేస్తే వికెట్ తీయలేమని అన్నారు. ఒకవేళ బౌండరీలు పడినా, తదుపరి బంతికి అతడిని ఎలా అవుట్ చేయాలనే దానిపైనే దృష్టి పెట్టాలని తెలిపారు.
Also Read : టెస్టులకు టైమ్ కావాలి.. గిల్ కీలక వ్యాఖ్యలు
Follow Us On: X(Twitter)

