విక్టరీ వెంకటేశ్ ఫస్ట్ లుక్ వైరల్.. ఈసారి ఆర్మీ ఆఫీసర్!

కలం, వెబ్ డెస్క్: విక్టరీ వెంకటేశ్ (Victory Venkatesh) ఈసారి ఆర్మీ ఆఫీసర్ అవతారం ఎత్తారు. శత్రువుల అంతు చూడటంతో పాటు ఇబ్బందుల్లో ఉన్న వారిని కాపాడటమే తన ప్రధాన కర్తవ్యం అంటున్నారు. ఆ విశేషాలేంటో చూడాలంటే వచ్చే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వెంకటేశ్ ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ పాత్రలో ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేశ్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ‘మన శంకర వర ప్రసాద్’ మూవీలో వెంకీ గౌడ అనే బిజినెస్‌మెన్ పాత్రలో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అయిదోసారి కాంబో..

అనిల్ రావిపూడి–విక్టరీ వెంకటేశ్ కాంబోలో ఈ మూవీతో కలిపి అయిదు సినిమాలు వచ్చాయి. అవన్నీ బ్లాక్ బస్టర్ కావడంతో హిట్ పెయిర్‌గా ముద్ర పడిపోయింది. తొలిసారి కళ్యాణ్​ రామ్ కూడా మల్టీ స్టారర్ మూవీ చేస్తుండటంతో చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. హీరోయిన్లుగా కీర్తి సురేశ్, కృతి శెట్టి నటిస్తున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌. ఈసారి కూడా 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>