కలం, వెబ్ డెస్క్: కరువు పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటకలోని (Karnataka) హరగి గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి తర్వాత వరుడి కుటుంబం ఇచ్చే ‘బీగర ఊట’ నాన్‌వెజ్ విందుపై గ్రామ పెద్దలు నిషేధం విధించారు. పెళ్లి ఖర్చులు, విందు నిర్వహణ వల్ల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినంగా జరిమానా విధించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. నాన్‌వెజ్ విందు ఏర్పాటు చేసిన కుటుంబానికి రూ.లక్ష జరిమానా, ఆ విందులో పాల్గొని భోజనం చేసిన ప్రతి అతిథికి రూ.50 వేల ఫైన్ విధించనున్నట్లు తెలిపారు. కరువు పరిస్థితుల్లో ఖర్చులను తగ్గించడంతోపాటు గ్రామంలో పొదును ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

