సింగరేణిపై కాంగ్రెస్ సర్కార్ అన్యాయం.. హరీశ్ రావు కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో సింగరేణి (Singareni) సంస్థ రోజురోజుకు దిగజారిపోతోందని.. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 14న రామగుండంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. సింగరేణి కార్మికులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఎన్నికలు వెంటనే జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన హరీశ్ డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ సింగరేణి కార్మికులకు బకాయిలను వెంటనే రిలీజ్ చేయాలన్నారు.

భట్టి సమాధానం చెప్పాలి..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తిని పెంచిందని హరీశ్ రావు (Harish Rao) కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గణనీయంగా బొగ్గు ఉత్పత్తి (Coal Production) పడిపోయిందని ఆరోపించారు. దాదాపు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులకు రోజురోజుకూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : జ్ఞానేష్ కుమార్‌కు మాజీ జడ్జిల మద్దతు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>