కలం, హనుమకొండ: భద్రకాళి ఆలయం వెనుక చరబండ్ల రాజుల కాలనీలో పేదల ఇళ్ల కూల్చివేతను (House Demolition) వెంటనే నిలిపివేయాలని మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఇళ్లను కూల్చివేస్తే కోర్టు ధిక్కరణకు దారితీస్తుందని అన్నారు. దళితులు, పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ (BRS) అండగా ఉంటుందని తెలిపారు. మాజీ కార్పొరేటర్ జోరికే రమేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, ఎన్నికల్లో ప్రజలే అంతిమ నిర్ణేతలని పేర్కొన్నారు.

