టెన్త్ పరీక్ష రాస్తున్న విద్యార్థికి అస్వస్థత.. సహాయం చేసిన కలెక్టర్

కలం, వరంగల్ బ్యూరో: ​పదో తరగతి పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థి అస్వస్థతకు గురవడంతో గుర్తించిన కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) వెంటనే స్పందించి తన ఉదారతను చాటుకున్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ జడ్పీ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలకు చెందిన కీర్తన అనే విద్యార్థి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర నీరసంతో ఉండటాన్ని కలెక్టర్ గమనించారు. ​పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వ్యక్తిగత సిబ్బందిని తోడుగా ఇచ్చి అధికారిక వాహనంలోనే బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు.

అనంతరం పరీక్షా కేంద్రం తనిఖీ ముగించుకుని నేరుగా ఆసుపత్రికి వెళ్లిన కలెక్టర్ (Collector Rahul Sharma), వైద్యులతో మాట్లాడి విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాలికకు ధైర్యం చెప్పి ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి తన వాహనంలోనే పరీక్షా కేంద్రానికి పంపించి ఆమె పరీక్ష రాసేలా చొరవ చూపారు. ఆపద సమయంలో తక్షణమే స్పందించిన కలెక్టర్ తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అసమర్ధ మంత్రులు వీరే.. హైకమాండ్‌కు ‘కాంగ్రెస్ ఫ్రెండ్స్’ సంచలన లేఖ..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>