కలం, వరంగల్ బ్యూరో: వరంగల్, కరీంనగర్ జాతీయ రహదారిలోని హసన్పర్తి పెద్ద చెరువు మూల మలుపు వద్ద రోడ్డును విస్తరించాలని అధికారులను హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం అధికారులతో కలసి ఆమె హసన్పర్తి మూల మలుపు వద్ద రోడ్డును పరిశీలించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయని ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు (MLA Nagaraju) ప్రస్తావించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత అధికారులను కోరారు. ఈ క్రమంలో హసన్పర్తి మండల కేంద్రానికి కలెక్టర్ వచ్చారు. పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న బ్లాక్స్పాట్ను జాతీయ రహదారులు, ఆర్అండ్బి, సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు విస్తరణకు ఉన్న అవకాశాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అక్కడికక్కడే సమీక్షించారు (Hanumakonda). మలుపు ప్రాంతం ఇరుకుగా ఉండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు కలెక్టర్ గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణతో ప్రమాదాలు తగ్గుతాయి కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై జాతీయ రహదారులు, ఆర్అండ్బి శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector Chahat Bajpai) సూచించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్అండ్బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎస్ఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: వార్ ఎఫెక్ట్ : పాక్లో స్కూళ్లు మూత.. జీతాల్లో కోత
Follow Us On: Instagram

