హమీర్‌పూర్‌లో విషాదం: వంతెన కూలి ఆరుగురి మృతి!

కలం, వెబ్‌ డెస్క్ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ (Hamirpur) జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బెత్వా నదిపై కొత్తగా నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరికొంతమంది కార్మికులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అర్ధరాత్రి సమయంలో కార్మికులంతా ఘాఢ నిద్రలో మునిగిపోయి ఉన్న వేళ ఈ ప్రమాదం సంభవించింది. వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో, కనురెప్ప మూసి తెరిచేలోపు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>