కలం, వెబ్ డెస్క్: ఈతరం యువత రిలేషన్స్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. బిజీ లైఫో, సినిమా ప్రభావమో.. కారణాలు ఏమైనా తమకంటూ ఓ పార్ట్‌నర్ ఉండాలని ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సరైన పార్ట్‌నర్ కోసం వేచిచూసే ఓపిక లేక.. డేటింగ్ యాప్స్‌పై ఆధారపడుతున్నారు. టిండర్, బబుల్ లాంటి డేటింగ్ యాప్స్ (Dating Apps) యూజ్ చేస్తూ ఎక్కువగా గడుపుతున్నారు. పరిచయమైన పార్ట్‌నర్‌తో వెంటనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. కొందరైతే అనైతికంగా సంబంధాలు కొనసాగిస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ లేడీ గైనకాలజిస్ట్ యువతను తీవ్రంగా హెచ్చరించారు.
డేటింగ్ యాప్స్ ద్వారా ఏర్పడుతున్న పరిచయాలు యువతలో అసురక్షిత లైంగిక సంబంధాలను పెంచి, HIVకి కారణమవుతుందని మండిపడ్డారు. లైంగికంగా సంక్రమించే వ్యాధులు వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 19-20 ఏళ్ల యువతుల్లో పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకొవద్దని సూచించారు. సురక్షితమైన నిర్ణయాలు తీసుకోవాలని యువతను కోరారు. ప్రస్తుతం ఈ లేడీ గైనకాలజిస్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డేటింగ్ యాప్స్ వాడుతున్నారా?
-డేటింగ్ యాప్స్ వాడే యువతకు గైనకాలజిస్ట్ హెచ్చరిక!
-యువతలో అసురక్షిత లైంగిక సంబంధాలు
-HIV, STDలు వంటి వ్యాధులు వ్యాప్తి..
-19-20 ఏళ్ల యువతుల్లో పెరుగుతున్న పెల్విక్, జెనైటల్ ఇన్‌ఫెక్షన్ కేసులుGynecologist Warns of Rising HIV and STD Risks Linked… pic.twitter.com/VAH3Dvj6Qu
— Kalam Daily (@kalamtelugu) July 31, 2026

