కలం, వెబ్ డెస్క్: గతంలో సైకిల్ అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చి, నవ్వుల పాలైన పాకిస్తాన్ (Pakistan) మరోసారి నెటిజన్స్ ట్రోల్స్‌కు గురైంది. డ్రైవర్ లేకుండా నడిచే కారును కనిపెట్టామని గొప్పగా చెప్పుకోవాలనుకున్న ఓ యువకుడికి ఊహించని షాక్ ఎదురైంది. అబాటాబాద్‌కు చెందిన ఈ యువకుడు తన కారు శాటిలైట్, ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా ఆపరేట్ (Driverless Car) అవుతుందని రిపోర్టర్‌కు వివరించాడు. దీన్ని టెస్ట్ చేసి వార్తల్లో ఇవ్వాలని కోరగా, రిపోర్టర్ పరీక్షిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా పక్కకు వెళ్లి పోలీస్ వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనపై యువకుడు స్పందిస్తూ.. సడెన్‌గా ఇంటర్నెట్ కనెక్షన్ కట్ అవడంతోనే ఇలా జరిగిందని చెప్పాడు. డ్రైవర్ లేకపోయినా.. నెట్‌వర్క్ మాత్రం ఉండాల్సిందే కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : మెస్సీ రిటైర్మెంట్.. ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!
Follow Us On : WhatsApp

