ఆసియా రిలేస్‌కు భారత్.. గురిందర్‌కు మరో కీలక బాధ్యత

కలం, స్పోర్ట్స్ : భారత అథ్లెటిక్స్‌లో కొత్త రికార్డుతో సంచలనం సృష్టించిన గురిందర్‌వీర్ సింగ్‌ (Gurvindervir Singh) కు మరో కీలక బాధ్యత దక్కింది. చైనాలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే ఆసియా రిలేస్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన 29 మంది సభ్యుల భారత జట్టుకు అతడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇటీవల రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్‌లో గురిందర్‌వీర్ 10.09 సెకన్లలో 100 మీటర్ల రేసును పూర్తి చేసి కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. దీంతో భారత స్ప్రింటింగ్‌లో కొత్త మైలురాయిని అందుకున్న అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు.

చైనాలో జరిగే ఆసియా రిలేస్‌లో భారత్ మొత్తం ఆరు విభాగాల్లో పోటీ పడనుంది. పురుషుల, మహిళల 4×100 మీటర్లు, 4×400 మీటర్ల రిలేలతో పాటు మిక్స్‌డ్ 4×100 మీటర్లు, మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలేల్లో కూడా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీ అథ్లెట్లకు ఖండ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే మంచి అవకాశమని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బహదూర్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి అథ్లెట్ల ప్రదర్శనను అభిమానులు దగ్గరగా వీక్షించే అవకాశం కూడా లభిస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు, ఆసియా రిలేస్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. హాంకాంగ్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ అసోసియేషన్ సమావేశంలో ఈ హక్కులు భారతదేశానికి లభించగా, పోటీలు చండీగఢ్‌లో నిర్వహించనున్నారు. చైనాలో జరిగే ఈ పోటీలు భారత అథ్లెట్ల ప్రదర్శనకు కీలక వేదికగా మారనున్నాయి. అలాగే భవిష్యత్‌లో స్వదేశంలో జరిగే ఆసియా రిలేస్‌కు కూడా ఇవి మంచి సన్నాహకంగా నిలవనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>