ఐపీఎల్ ప్లేయర్ అరెస్ట్.. యువతిని నమ్మించి!

కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పొరెల్‌ (Abishek Porel) చిక్కుల్లో పడ్డారు. అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కలకత్తా హైకోర్ట్ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. యువతిని నమ్మించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ మేరకు కోర్ట్ స్పందించింది.

బాధితురాలి భద్రతను దృష్టిలో ఉంచుకుని అభిషేక్ పొరెల్ ఫోన్, ల్యాప్ టాప్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్‌లను వెంటనే సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.

పెళ్లి చేసుకుంటానని..

ఫిర్యాదు ప్రకారం.. 23 ఏళ్ల అభిషేక్ (Abishek Porel) సదరు యువతితో గత మూడేళ్లుగా రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు లైంగిక దాడి జరిపినట్లు పేర్కొన్నారు. పెళ్లి గురించి అడిగితే అభిషేక్ పట్టించుకోవడం లేదని బాధితురాలు వివరించారు. ఈ మేరకు బెంగాల్‌లోని మోగ్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. తాజాగా విచారించిన కోర్ట్.. అభిషేక్‌ని అరెస్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: పాకిస్తాన్‌లో ‘సైకిల్ అంబులెన్స్’.. నెట్టింట దారుణంగా ట్రోల్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>