Mobile Popup Ad
Mobile Popup Ad

గురుగ్రామ్‌లో దారుణం: పార్టనర్‌పై యువకుడి పైశాచికం

కలం, వెబ్​ డెస్క్​ : హర్యానాలోని గురుగ్రామ్‌ (Gurugram)లో ఒక కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో కలిసి ఉంటున్న 19 ఏళ్ల యువతిని ఒక యువకుడు అత్యంత క్రూరంగా హింసించాడు. బాధితురాలు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతుండగా, ఆమెపై సదరు యువకుడు అమానుషానికి ఒడిగట్టాడు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడు ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. అంతేకాకుండా, ఆ భయానక దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన గురుగ్రామ్ (Gurugram) పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read Also: దేశంలో ఉగ్రకుట్ర భగ్నం: ముష్కరుల అరెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>