Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమం

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) పై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్ఏ-2 (బూత్ లెవల్ ఏజెంట్-2) సభ్యుల శిక్షణ కార్యక్రమం ఆదివారం కరీంనగర్ (Karimnagar) నగరంలోని సీతారాంపూర్ పీఎం కన్వెన్షన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పీసీసీ ఉపాధ్యక్షుడు, మాస్టర్ ట్రైనర్ నమ్మిండ్ల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం (Medipally Sathyam) మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, లౌకికవాద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుగ్గా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ (Karimnagar) అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ కుట్రలను అడ్డుకొని తీరుతామని, ఓట్లు చోరీ కాకుండా ప్రతి కార్యకర్త సైనికుల వలె అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మాస్టర్ ట్రైనర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్లు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పాల్గొని ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. సంబంధం లేని కేసులో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని, కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీతోపాటు సీట్ చోరీ కూడా చేస్తుందని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా నిజాయితీగా గాంధీయవాది పద్ధతిలో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజ్ నామినేషన్ తిరస్కరించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) మాట్లాడుతూ.. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరారు. ఓటరు నమోదు, మార్పులు చేర్పుల ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వైద్యుల అంజన్ కుమార్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ మాట్లాడుతూ.. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని, ప్రతి ఇంటిలో ఉన్న ఓటర్ల వివరాలను సమగ్రంగా తెలుసుకుని ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్ నమ్మిండ్ల శ్రీనివాస్ బీఎల్ఏ-2 సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై సమగ్ర శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు ఎండి తాజ్, వరాల నర్సింగం, గంట శ్రీనివాస్, పర్వతం మల్లేశం, గుమ్మడి రాజ్ కుమార్, మడుపు మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పడాల అజయ్ గౌడ్, కాంతాల జగన్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, మూల రవీందర్ రెడ్డి, వేల్పుల వెంకటేష్, సిరాజ్ హుస్సేన్, పడిశెట్టి భూమయ్య, కాసెట్టి శ్రీనివాస్, వంగల విద్యాసాగర్, అబ్దుల్ రహమాన్, నిహాల్, కుంభాల రాజ్ కుమార్, మంద మహేష్, గంటకల్యాణి, ముసర్ల రామ్ రెడ్డి, వసీం, ఇమ్రాన్, తోట అంజయ్య, కుర్ర పోచయ్య, విద్యాసాగర్ రెడ్డి, అహమ్మద్ అలీ, వీర దేవేందర్, పెంట శేఖర్, పోరండ్ల రమేష్, మాదాసు శ్రీనివాస్, బొబ్బిలి విక్టర్, సత్తినేని శ్రీకాంత్, హస్తపురం తిరుమల, జీడి రమేష్, హాజీ, అనిల్ కుమార్ గుప్తా, బత్తిని చంద్రయ్య గౌడ్, మాలోతు మహాలక్ష్మి, హసీనా, జ్యోతి రెడ్డి, హనీఫ్, కొల గాని అనిల్, మాజీద్ అలీ ఖాన్, జీఎస్ ఆనంద్, ఖలీల్, సరోజ, శ్రీరాముల రమేష్, మీసా రమాదేవి, కర్రె పావని, మూల జయపాల్, సాయిని తిరుపతి, కామ్రెడ్డి రాంరెడ్డి, రాచర్ల పద్మ, కిరణ్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి, దండి రవీందర్, సిరిపురం మనోజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, బూత్ స్థాయి ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: మేం రాజీనామా చేస్తాం.. మీరు రెడీనా?’.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>