తుపాకీ మిస్ ఫైర్.. విశాఖలో కలకలం!

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam)లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఐఎన్ఎస్ డేగా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ కొండబాబు వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడగా.. వెంటనే సమీపంలోని షీలా నగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. తూర్పు నేవీ కమాండ్ పరిధిలోని భద్రత పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతంలో కాల్పుల శబ్ధం రావడంతో అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఐఎన్ఎస్ డేగా వద్ద కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో విధుల్లో ఉండగా.. కొండబాబు తుపాకీ మిస్ ఫైర్ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై నేవీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>