సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు అక్టోబర్ 7వ తేదీన నిర్వహించనున్న “సైబర్ జాగృక్త దివస్” (Cyber Jagrookta Diwas) కార్యక్రమంలో భాగంగా, అక్టోబర్ నెల మొత్తం జిల్లాలో విస్తృత స్థాయిలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి (SP Janaki) తెలిపారు.

టీజీసీఎస్‌బీ డైరెక్టర్ శిఖా గోయల్ ఆదేశాల మేరకు, సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేలా నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో “సైబర్ జాగృక్త దివస్”కు సంబంధించిన పోస్టర్లను అధికారికంగా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలకు అవసరమైన జాగ్రత్తలు, ఆన్‌లైన్ లావాదేవీల భద్రత, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అక్టోబర్ నెలలో జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పట్టణ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, “సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే మనకు రక్షణ” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ నాగార్జున గౌడ్, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్, వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ వసంత పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>