epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎస్టీలకు రిజర్వేషన్ గైడ్‌లైన్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కలం డెస్క్ : గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు(Panchayat Elections) సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టింది. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీల్లో రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన చేపట్టాలో, ఎవరు చేయాలో నిర్దిష్టమైన మార్గదర్శకాలను వివరిస్తూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. షెడ్యూల్డు ఏరియాల్లో వంద శాతం జనాభా గిరిజనులు, ఆదివాసీలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల పోస్టులన్నీ వారికే రిజర్వు చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ఇతర కమ్యూనిటీలవారు కూడా ఉన్నట్లయితే కచ్చితంగా సగం స్థానాలను ఎస్టీలకు రిజర్వు చేయాలని పేర్కొన్నారు. సర్పంచ్, మండల పరిషత్ స్థానాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎస్టీలకే రిజర్వు చేయాలని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారుకాగా మిగిలిపోయినవన్నీ జనరల్ (అన్ రిజర్వుడు)గా ఉంటాయి.

గత ఎన్నికల రిజర్వేషన్‌లలో మార్పు :

గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో(Panchayat Elections) ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ ఖరారు చేసిన స్థానాలను ఈసారి కూడా అదే కేటగిరీలో ఉంచకుండా చూడాలని, రొటేషన్ పద్ధతిలో మిగిలినవారికి కూడా అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. డెడికేటెడ్ కమిషన్ స్పష్టమైన నివేదికను తయారుచేసి రిజర్వేషన్‌కు ప్రాతిపదికన ఫిక్స్ చేసినందున, ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించినందున వాటిని ఫాలో కావాలని ఆ ఉత్తర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు. రిజర్వేషన్ ఖరారు చేసే ముందు ఎస్టీ, ఎస్టీ, బీసీ, మహిళ అనే కేటగిరీలను ప్రామాణికంగా తీసుకోవాలని, ఆ కేటగిరీలవారు లేరని తెలిసిన తర్వాతనే రొటేషన్ పద్ధతిలో ఎలా మార్పులు చేయాలో, జనరల్ స్థానాలుగా ఎలా ప్రకటించాలో ఈ మార్గదర్శకాలను అనుసరించాలని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ స్థానాలూ ఛేంజ్ :

స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు కానున్నందున వారికి గత ఎన్నికల్లో రిజర్వు చేసిన స్థానాలను ఈసారి యధావిధిగా ఉంచరాదని ఉత్తర్వుల్లో ముఖ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఈసారి వాటిని మార్చాలన్నారు. గతంలో మహిళలకు రిజర్వు కాని స్థానాలను ఈసారి వారికి కేటాయించేలా ఆచరణాత్మకంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. గతంలో (2019లో) ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినా ఎన్నికలు జరగని స్థానాలకు అదే రిజర్వేషన్ ఫార్ములాను (మహిళలకు కేటాయింపు) అనుసరించవచ్చన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభాకు అనుగుణంగా మండల ప్రజా పరిషత్ స్థానాలను జిల్లా కలెక్టర్ పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్‌ను ఫిక్స్ చేయాలన్నారు. సర్పంచ్, ఎన్నికలకు ఆర్డీవో, వార్డు సభ్యుల ఎన్నికకు ఎంపీడీవో ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు.

Read Also: ఛార్జిషీట్‌కు ముందా?.. తర్వాతా?.. కేటీఆర్ అరెస్టుపై ఊహాగానాలు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>